కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు

కలుషిత నీటితో ప్రజలు ఇబ్బందులు

సత్యసాయి: పరిగి పంచాయతీ బోయగడ్డ కాలనీలో కలుషిత నీరు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజూ కుళాయిల ద్వారా కలుషిత నీరు వస్తున్నాయని వాపోతున్నారు. ఇంటి అవసరాలకు నీటిని ఎలా ఉపయోగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.