వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంజూరు చేసిన ఎంజీటీ. పర్యావరణ పరిహార నిధులతో మలికిపురం మండలం దిండి గ్రామంలో 43.10 లక్షల రూపాయల వ్యయంతో 40 వేల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంక్ నిర్మించారు. ఈ ట్యాంకును శనివారం రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన యనుముల వెంకటపతిరాజకు కృతజ్ఞతలు తెలిపారు.