భద్రాచల రామాలయంలో ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం

భద్రాచల రామాలయంలో ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం

ఖమ్మం: భద్రాచలం సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయంలో నిత్య విధి అనంతరం శ్రీరామ చంద్ర మూర్తిని గరుడ వాహనదారునిగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయుద్యాలు, వేద మంత్రాలు, నడుమ ఆలయం నుండి ముక్కోటి వైకుంఠ ద్వారం వద్దకు తీసుకు వచ్చి క్రతువు నిర్వహించారు.