నందవరంలో భారీ వర్షం.. ఆందోళనలో రైతులు

KRNL: నందవరం మండలంలో ఇవాళ ఉదయం భారీ వర్షం కురిసింది. గంగవరం, పూలచింత, జొహరాపురం గ్రామాలలో కురిసిన వర్షానికి పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మిర్చి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. పత్తి విడుపును తీసుకోవడానికి వీలులేకుండా పోయిందని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. నందవరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.