'డ్రోన్ల వినియోగంతో ఖర్చు తగ్గుతుంది'

VZM: డ్రోన్ల వినియోగంతో ఖర్చు ఆదా అవుతుందని గజపతినగరం మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ అన్నారు. గురువారం గజపతినగరం మండలంలోని పాత శ్రీరంగరాజపురంలో డ్రోన్ల ద్వారా జీవామృతం పిచికారిపై రైతులకు అవగాహన కల్పించారు. పకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర పంటలు సాధ్యపడుతుందని చెప్పారు. ఇందులో కాలం రాజుపేట గ్రామ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు, ఆర్టీవో ప్రకాష్, పాల్గొన్నారు.