భూసేకరణకు రాజధాని రైతులు అనుకూలం: మంత్రి
AP: రాజధాని అమరావతి కోసం రెండో దశ భూసేకరణకు రైతులు సానుకూలంగా ఉన్నారని మంత్రి నారాయణ అన్నారు. CRDA సమావేశంలో రూ.169 కోట్లతో లోక్ భవన్, రూ.163 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్డును NH16కు అనుసంధానం చేసే పనులకు రూ.532 కోట్ల మేర టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు.