హనుమాన్ దీక్ష దారుడిని ఢీకొన్న వాహనం
JGL: మెట్ పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తున్న హనుమాన్ దీక్షాధారుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వాహనం డ్రైవర్ పరారైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.