కించుమండలో కొనసాగుతున్న మన్యం బంద్

ASR: డుంబ్రిగూడ మండలంలోని కించుమండలో మన్యం బంద్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాను కొనసాగిస్తున్నారు. వచ్చి పోయే వాహనాలను నిలిపివేశారు. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. జీవో నెంబర్ 3 పునర్ధరణ చేయాలని, అలాగే గిరిజన ప్రాంత ఉద్యోగాలు కేవలం గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి.