పొలంలో నాటు బాబు పేలుడు గేదెకు తీవ్ర గాయాలు
SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో పెట్టిన నాటు బాంబు పేలడంతో మేతకు వెళ్లిన పాడి గేదె తీవ్రంగా గాయపడింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గాయపడిన గేదెకు పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన నాటు బాంబు కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.