కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకాలు
SDPT: బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో నిర్మాణంలో కొనసాగుతున్న శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి దేవాలయంలో సోమవారం కడప కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ బ్రాహ్మణులు పూజలు నిర్వహించగా, అనంతరం స్వామివారికి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.