ముసిరాం గ్రామంలో నాటు తుపాకీతో హత్య

ముసిరాం గ్రామంలో నాటు తుపాకీతో హత్య

VZM: కొత్తవలస మండలం ముసిరాం గ్రామంలో నాటు తుపాకీతో కాల్చి చంపిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకొంది. పూర్తి వివరాల మేరకు గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును (60) పాతవలసకు చెందిన ఎస్. అప్పారావు నాటు తుపాకితో కాల్చి చంపాడు. కొంత కాలంగా ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలే హత్యకు కారణం అని భావిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి వచ్చి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.