గుడుంబా స్థావరంపై దాడి.. 20 లీటర్లు సీజ్

గుడుంబా స్థావరంపై దాడి.. 20 లీటర్లు సీజ్

BHPL: గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామంలో సోమవారం ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గుడుంబా స్థావరంపై దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు మంద పరశురాం ఇంట్లో తనిఖీ చేయగా 20 లీటర్ల నాటు గుడుంబా, 300 లీటర్ల జాగరి లభ్యమైంది. జాగరిని అక్కడే ధ్వంసం చేసి, గుడుంబాను స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.