క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

NRPT: రాష్ట్రంలోని మూడు క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి వెంకటేశ్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డితో కలిసి ప్రవేశాల వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించి, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని వెల్లడించారు.