ఘటిక సిద్దేశ్వరంలో ఎంపీ వేమిరెడ్డి పూజలు

NLR: సీతారామపురం మండలంలోని ప్రాచీనశైవక్షేత్రం ఘటిక సిద్దేశ్వరంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు ఎంపీని పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతించారు. పరమశివుడు, ఇష్టకామేశ్వరిదేవి, కాశినాయన ఆలయాల్లో ప్రత్యేకపూజలు చేశారు. ఆలయ పూజారులు, టీడీపీ నాయకులు ఎంపీ వేమిరెడ్డిని ఘనంగా సన్మానించారు.