'ఆదివాసులకు ప్రభుత్వమే న్యాయం చేయాలి'

MNCL: పాలగోరి ఆదివాసులకు ప్రభుత్వ న్యాయం చేయాలని సీపీఎం జన్నారం మండల కార్యదర్శి కనికారపు అశోక్ కోరారు. బుధవారం జన్నారం మండలంలోని పాలగోరిలో పర్యటించి ఆదివాసుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసులకు తరతరాలుగా భూమి వచ్చిందని, ఆ భూమిలో వారిని అటవీశాఖ అధికారులు రానివ్వకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం సర్వే చేయించి వారి భూములు వారికి ఇప్పించాలన్నారు.