అందుకే మంత్రి పదవి రాలేదు: MLA
NZB: తాను మంత్రి పదవి ఆశించిన మాట వాస్తమేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. కొన్ని సమీకరణాల వల్ల తనకు మంత్రి పదవి రాలేదని చెప్పారు. సెక్రటేరియట్‌లో బుధవారం ఉదయం ప్రభుత్వ సలహాదారుగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ సలహాదారు బాధ్యతలు అప్పగించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.