నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు
సంగారెడ్డి జిల్లాలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 21, 22 తేదీల్లో ప్రాథమిక, 24,25 తేదీల్లో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సముదాయ సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా వారి కాంప్లెక్స్ పరిధిలోని సమావేశాలకు హాజరు కావాలని సూచించారు.