ఉగ్రదాడిని నిరసిస్తూ తణుకులో స్కేటింగ్ ర్యాలీ

W.G: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ సోమవారం తణుకు మాంటిస్సోరి స్కూల్ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్కేటింగ్ అసోసియేషన్, స్కేటర్స్ ఆధ్వర్యంలో జరిగన ఈ సంఘీభావ ర్యాలీలో చిన్నారులు స్కేటింగ్ చేస్తూ మృతులకు ఘనంగా నివాళుల ర్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.