ఆర్థిక నేరాలలో నిబంధనలు పాటించాలి: ఎస్పీ

ఆర్థిక నేరాలలో నిబంధనలు పాటించాలి: ఎస్పీ

KDP: ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని సూచించారు. సోమవారం ఆయన అధికారులకు కేసుల విచారణలో నిర్దేశిస్తూ, క్రిమినల్ కేసులు నమోదైనప్పుడు వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు.