PGRSను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

BPT: కలెక్టర్ కార్యాలయం వద్ద ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో PGRS నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్జీల సమాచారానికి ప్రజలు కాల్ 1100కు ఫోన్ చేయవచ్చని పర్కొన్నారు.