సైబర్ నేరాలపై అప్రమత్తం: ఎస్పీ

సైబర్ నేరాలపై అప్రమత్తం: ఎస్పీ

W.G: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియా వేదికగా దసరా బిగ్ సేల్ ఆఫర్లు అంటూ నేరగాళ్ల ప్రచారాలకు మోసపోవద్దని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. నేరగాళ్లు వివిధ పద్ధతులను ఉపయోగించి ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఫోన్ కాల్స్, SMS, సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.