బాణసంచా ఘటన.. చిన్నారులను పరామర్శించిన మురళీకృష్ణ

బాణసంచా ఘటన.. చిన్నారులను పరామర్శించిన మురళీకృష్ణ

GNTR: పెదకాకాని బాజీ బాబా దర్గా ఉరుసు మహోత్సవంలో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన చిన్నారులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గాయపడిన వారిని శనివారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.