నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం నాలుగో విడతలో భాగంగా శనివారం 1,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.076 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాలువల పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, పశుపాలకులు అప్రమత్తంగా ఉండాలన్నారు.