సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
ఖమ్మం కిన్నెర నర్సింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.