పోలీస్ పీజీఆర్ఎస్‌కు 65 ఫిర్యాదులు

పోలీస్ పీజీఆర్ఎస్‌కు 65 ఫిర్యాదులు

అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 65 ఫిర్యాదులు అందినట్లు అదనపు ఎస్పీ మోహన్ రావు తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వినతులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించి ఏడో రోజులలోపు విచారణ పూర్తి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.