'తెలుగు జాతికి నూతన దిశను చూపిన అమరజీవి'

'తెలుగు జాతికి నూతన దిశను చూపిన అమరజీవి'

PPM: ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆమరజీవి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. భాషా రాష్ట్రాల సాధనలో కీలక పాత్ర పోషించిన పొట్టి శ్రీరాములు తన నిరాహార దీక్ష ద్వారా తెలుగు జాతికి నూతన దిశను చూపించారని కొనియాడారు.