VIDEO: చందూర్‌లో డ్రైనేజీ పనులు చేపట్టాలని వినతి
NZB: చందూరు ప్రయాణ ప్రాంగణం నుంచి పంచాయతీ కార్యాలయం వరకు తక్షణమే డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులతో పాటు శ్రీ విఘ్నేశ్వర కాలనీవాసులు శనివారం సర్పంచ్ మద్దూరు మాధవరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇటీవల రోడ్డు పనులు పూర్తయినా, డ్రైనేజీ పనులు చేపట్టకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న వర్షాకాలంలో డ్రైనేజీ లేక నీరు నిలిచి ఇళ్లలోకి చేరుతుందని వాపోయారు.