ఇల్లందు నుంచి మేడారం వరకు ప్రత్యేక బస్సు: ఎమ్మెల్యే
BDK: మేడారం వెళ్లే భక్తులకు ఈ సర్వీస్ సౌకర్యవంతంగా ఉంటుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. ఇల్లందు నుంచి మేడారం వరకు ప్రత్యేక బస్సు సర్వీస్‌ను నిన్న ఆయన ప్రారంభించారు. ఇల్లందు డిపోకు చెందిన ఈ బస్సు గుండాల, పసర మీదుగా మేడారం చేరుకుంటుంది.