NTR గ్రౌండ్స్ సమీపంలో అపారిశుద్ధ్యం
ASR: అరకులోయలోని NTR గ్రౌండ్స్ సమీపంలో అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. ఎక్కడికక్కడ చెత్త చెదారం దర్శనమిస్తోంది. ఈ గ్రౌండ్స్ నుంచి శరభగూడ, జెడ్పీ కాలనీ, అరకు ఏరియా ఆసుపత్రి మార్గంలో నిత్యం రద్దీగా రాకపోకలు జరుగుతుంటాయి. పారిశుద్ధ్యం వికటించడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. అధికారులు దీనిపై సందించాలని స్థానికులు కోరుతున్నారు.