అలర్ట్.. ప్రజలు బయటకి రావొద్దు
ASR: రేపు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇందులో భాగంగా జిల్లాలోని 21 మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ప్రజలు మంచినీరు, మజ్జిగ, ORS వంటివి ఎక్కువగా తీసుకోవాలన్నారు.