దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులు అరెస్ట్
kdp: దొంగతనం కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తొండూరు ఎస్సై ఘన మద్దిలేటి తెలిపారు. శనివారం తొండూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మాట్లాడుతూ.. హిదయతుల్లా, గైబూసా జల్సాలకు అలవాటుపడి వరుస దొంగతనాలకు పాల్పడుతుండేవారన్నారు. ఇటీవల మల్లేల గ్రామంలోని మసీదులో వారు హుండీని పగలగొట్టి రూ. 30 వేల నగదును అపహరించుకెళ్లినట్లు పేర్కొన్నారు.