చికిత్స పొందుతూ బాలుడు మృతి
VSP: ద్వారక నగర్‌కు చెందిన బాలుడు అక్షయ్ అపార్ట్‌మెంట్ వద్ద ఆడుకుంటుడగా గోతిలో పడి గాయపడ్డాడు. దీంతో ఈ నెల 3న కేజీహెచ్‌లో చేర్పించారు. కాలికి ఆపరేషన్ చేసిన అనంతరం బాలుడు కోమలోకి వెళ్లగా రెండు రోజులుగా వెంటిలేటర్ పైన ఉంచారు. ఇవాళ ఉదయం మృతి చెందడంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.