పనులు పరిశీలించిన కలెక్టర్
CTR: త్వరలో చిత్తూరు పట్టణంలో ప్రారంభించబోయే కేంద్రీయ విద్యాలయం పనులను కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల భవన నిర్మాణ పనులు, తరగతి గదుల సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.