అత్యాచార కేసులో సుప్రీం ఆగ్రహం

అత్యాచార కేసులో సుప్రీం ఆగ్రహం

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులతో హర్యానా గురుగ్రామ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడింది. దర్యాప్తులో భాగంగా బాధితురాలి ఇంటికి అధికారులు వెళ్లకుండా వారినే స్టేషన్‌కు రప్పించడం సిగ్గుచేటని ధ్వజమెత్తింది. అసలు బాధితురాలి ఇంటికి ఎందుకు వెళ్లలేదని.. మీరేమైనా రాజులా అంటూ ప్రశ్నించింది.