విఘ్నేశ్వరుని అన్నదాన ట్రస్ట్ కు రూ.25 వేలు విరాళం
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సోమవారం కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారం గ్రామంకి చెందిన టి.జానకిరామయ్య, నాగభవాని మహేశ్వరి దంపతులు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళంగా రూ.25,100 లు ఆలయ అధికారులకు అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రములతో సత్కరించారు.