పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ
PPM: జిల్లా ఎస్పీ S. V. మాధవ రెడ్డి మంగళవారం కురుపాం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, లాకప్, రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులపై వివరాలు తెలుసుకున్నారు. హెల్మెట్ ధరింపుపై అవగాహన కల్పిస్తూ, మద్యం సేవించి వాహనం నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి, నాటు సారా ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలని సూచించారు.