తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు జప్తు

తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులు జప్తు

AKP: ఈపీఎఫ్‌వో బకాయిలు చెల్లించకపోవడంతో పాయకరావుపేటలో తాండవ సుగర్ ఫ్యాక్టరీకి చెందిన 960 గజాల ఖాళీ స్థలాన్ని జప్తు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు శివరామకృష్ణ, వనిజ మంగళవారం తెలిపారు. విశాఖ ఈపీఎఫ్‌వో కార్యాలయానికి రూ. 2.76 కోట్లు బకాయిలు ఫ్యాక్టరీ చెల్లించాల్సి ఉందన్నారు. పీఎఫ్ కమిషనర్ ధర్మేంద్ర ఆదేశాల మేరకు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పుకొచ్చారు.