గుంటూరు జీజీహెచ్ సేవలు మెరుగుపరచాలి: కలెక్టర్

గుంటూరు జీజీహెచ్ సేవలు మెరుగుపరచాలి: కలెక్టర్

GNTR: గుంటూరు జీజీహెచ్‌లో వైద్య సేవలు ఆదర్శంగా ఉండాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం అధికారులను ఆదేశించారు. రాత్రివేళల్లో వైద్యుల అందుబాటు, అంబులెన్స్, మందుల కొరత ఫిర్యాదులపై ఆమె సీరియస్‌గా స్పందించారు. పటిష్ట పర్యవేక్షణతో పేదలకు నాణ్యమైన చికిత్స, మెరుగైన వసతి సౌకర్యాలు అందించాలని సూచించారు. స్క్రబ్ టైఫస్ వంటి జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.