ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన మంత్రి

KNR: సైదాపూర్ మండలం ఆకునూరులో కస్తూరిబా బాలికల విద్యాలయంలో డార్మెటరీ హాల్‌కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఓపెన్ జిమ్‌ను గురువారం ప్రారంభించారు. స్టీలు బ్యాంకు సామాగ్రిని మహిళా సంఘాలకు అందజేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ లక్ష్మీ కిరణ్ పాల్గొన్నారు.