కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే
కోనసీమ: కూటమి ప్రభుత్వంలో ప్రజాసంక్షేమానికి తొలి ప్రాధాన్యత లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. పొద్దు పొడవకముందే ప్రతీ నెలా మొదటి రోజునే అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లతో నిరుపేదల జీవితాలకు భద్రత, భరోసా లభిస్తుందన్నారు. సోమవారం చొప్పెల్లలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.