'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి'
BHNG: ఆలేరులో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట డిపో వద్ద సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు, పెండింగ్ పే స్కేల్, పీఆర్సీ బకాయిల విడుదల వంటి డిమాండ్లను వారు ప్రభుత్వం ముందుంచారు.