సింగరేణి సరికొత్త రికార్డు.. కార్మికులను అభినందించిన GM
PDPL: సింగరేణి RG–1 పరిధిలోని ఓసీపీ 5 ప్రాజెక్ట్ బొగ్గు రవాణాలో 34,09,365 టన్నుల రికార్డు సాధించిందని జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టును సందర్శించి, కార్మికులను అభినందించారు. ఉత్పత్తి లక్ష్యం 32 లక్షల టన్నులను విజయవంతంగా పూర్తి చేశామని, వచ్చే ఏడాది కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగు శ్రీను, డి.రమేష్, రామమోహనరావు, తదితరులు పాల్గొన్నారు.