జైనుల ఆధ్వర్యంలో ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు
ASF: జిల్లా కేంద్రంలో మహావీర్ జయంతిని పురష్కరించుకుని జైనుల ఆధ్వర్యంలో మహావీర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహావీర్ జయంతిలో భాగంగా ఉదయం 9:30 గంటలకు తేరువీధిలోని జైనుల ఆలయంలో జైనులు, మార్వాడీలు మహావీర్ విగ్రహానితో ఊరేగింపు చేపట్టారు. కాగజ్ నగర్‌లో జైనుల ఆలయం నుండి ఊరేగింపు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మహావీరుడు చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరూ నడవాలని తెలిపారు.