గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

NGKL: ఉప్పునుంతల మండలంలోని లత్తిపూర్ కట్టమైసమ్మ గుడి దగ్గర సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అతని వద్ద ఊరిపేరుకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరికైన ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.