భారీ వర్షంతో జలమయమైన రోడ్లు

SRCL :ఎల్లారెడ్డిపేట కేంద్రంలో గురువారం భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. పాత బస్టాండ్ ప్రాంతంలో రోడ్డుపై నీరు నిలవడంతో కాలినడకన వెళ్లేవారు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్క సారిగా భారీ వర్షం కురవడంతో, స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.