భూపాలపల్లిలో 31 మి.మీ వర్షపాతం నమోదు

BHPL: జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటల వరకు 31.0 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా చిట్యాల 1.4 మి.మీ, మొగుళ్లపల్లి 1.4 మి.మీ, రేగొండ 23.0 మి.మీ, ఘన్‌పూర్ 4.0 మి.మీ, భూపాలపల్లి 1.2 మి.మీ వర్షం కురిసింది. టేకుమట్ల, మహదేవపూర్, పలిమెల, ముత్తారం, కాటారం, మల్హర్ రావు మండలాల్లో వర్షం నమోదు కాలేదు.