ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
KMM: తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ UPSలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయుడు భూక్యా కేశ్యా ఓ సంఘం కార్యక్రమంలో పాల్గొనడంతో అదనపు కలెక్టర్, ఇంచార్జీ DEO శ్రీజ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేశ్యా భోజన విరామ సమయంలో ప్రభుత్వ ఐటీఐ కోసం ప్రజాసంఘాలు చేస్తున్న దీక్షకు సంఘీ భావం తెలపడంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.