అయోమయంలో డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు

అయోమయంలో డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులు

SRPT: భారీ వర్షాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో గురువారం పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, డిగ్రీ, జానియర్ కళాశాలలకు సెలవు ప్రకటించకపోవడంతో విద్యార్థులు తీవ్ర అయోమయంలో పడ్డారు. వాగులు పొంగి గ్రామాల నుంచి పట్టణాలకు రాకపోకలు నిలిచిపోవడంతో కళాశాలలకు ఎలా హాజరు కావాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.