అయ్యప్ప భక్తులకు శుభవార్త
KMM: శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖమ్మం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. డిసెంబర్ 13, 18, 20, 22, 24, 26 తేదీల్లో ఒక్కో ట్రిప్ చొప్పున ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. పూర్తి వివరాలకు, టికెట్ల రిజర్వేషన్ కోసం స్టేషన్‌ను సంప్రదించాలన్నారు.