కోసిగిలో బీరువా పగలగొట్టి చోరీ

KRNL: కోసిగిలోని 9వ వార్డులో భీమయ్య ఇంట్లోకి గురువారం పట్టపగలే దొంగలు దూరి బీరువా పగలగొట్టి బంగారు, వెండి నగలను దోచుకెళ్లారు. భీమయ్య రైల్వే శాఖలో గ్యాంగ్ మెన్‌గా పని చేస్తున్నారు. ఉదయమే డ్యూటీకి వెళ్లారు. భార్య ఈరమ్మ బంధువుల పెళ్లికి వెళ్తూ ఇంటికి తాళాలు వేసి వెళ్లింది. గుర్తుతెలియని వ్యక్తులు మిద్దెపై నుంచి ఇంట్లోకి దూరి చోరికి పాల్పడ్డారని తెలిపారు.